గ్రౌండ్లోకి అనుకోని అతిథి.. పట్టుకోలేక అవస్థలు పడ్డ క్రికెటర్లు! - bready cricket club
🎬 Watch Now: Feature Video
ఇటీవల భారత్- ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో(Ind Eng Test) మైదానంలోకి వచ్చి.. జర్వో అనే వ్యక్తి పలుమార్లు మ్యాచ్లకు అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు.. గ్రౌండ్లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చి.. క్రికెటర్లను ముప్పుతిప్పలు పెట్టిందో బుజ్జి శునకం. ఈ ఘటన ఐర్లాండ్లో జరిగింది. మహిళల దేశీయ టీ-20 టోర్నమెంట్ మ్యాచ్ జరుగుతుంటే.. మైదానంలోకి వచ్చిన శునకం బంతిని నోటపెట్టుకొని పరుగెత్తింది. దానికి పట్టుకోలేక ఫీల్డర్లు అవస్థలు పడ్డారు.
అమెరికాలోనూ ఓ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా.. ఒక్కసారిగా ప్రత్యక్షమైన పిల్లి అందరి దృష్టిని ఆకర్షించింది. పైనుంచి పడబోయిన ఆ మార్జాలాన్ని గమనించిన అభిమానులు.. అమెరికా జెండా సాయంతో పట్టుకొని ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.