బ్రిటన్ పార్లమెంట్‌కు తాకిన 'ఫ్లాయిడ్' నిరసన సెగ - బ్రిటన్ వార్తలు
🎬 Watch Now: Feature Video

ఇటీవల అమెరికా-మిన్నెసొటా రాష్ట్రంలో మరణించిన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతిని నిరసిస్తూ బ్రిటన్‌లో చేస్తోన్న శాంతియుత ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి. పోలీసులు, నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారు పార్లమెంట్ ఆవరణలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని అదుపుచేసే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో సుమారు 23 మందిని నిరసనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు.