దీపకాంతులతో చైనా ముస్తాబు... ఎక్కడ చూసినా అందాలే! - spring festival
🎬 Watch Now: Feature Video
స్ప్రింగ్ ఫెస్టివల్ కోసం చైనా ముస్తాబవుతోంది. వేడుకల్లో భాగంగా జిగాంగ్ నగరంలో చైనా సంప్రదాయ 'మైనర్ న్యూ ఇయర్ డే' పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. 26వ జిగాంగ్ అంతర్జాతీయ డైనోసార్ ల్యాంటర్న్ వేడుకలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. చైనా ప్రజలు అనుసరించే లూనార్ ఇయర్లో చివరి మాసంలోని 23వ రోజున ఈ వేడుకలు జరుపుకుంటారు. నగరమంతా రంగు రంగుల దీపకాంతులో ముస్తాబైంది. నడిచే దారి, ఎత్తైన భవనాలు, కనిపించే ప్రతీదీ రంగు రంగుల కాంతులు చూపరులను మైమరపించాయి. లైటింగ్ ఏర్పాటు చేసిన 500డ్రోన్ కెమేరాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటిని చూడటానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు.
Last Updated : Jan 19, 2020, 1:45 PM IST