లైవ్ వీడియో:హెలికాఫ్టర్పై రాకెట్ దాడి.. అందరూ మృతి
🎬 Watch Now: Feature Video
సిరియాలో ఓ ప్రభుత్వ హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు సైనిక అధికారులు తెలిపారు. హెలికాఫ్టర్ కూలిపోవడానికి ముందు ఆకాశం నుంచి మంటలతో దూసుకొచ్చింది. రాకెట్ దాడి జరగడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని టర్కీ మద్దతుదారులు ప్రకటించారు. సిరియా సైన్యం తమ పౌరులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడినందునే.. ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Last Updated : Mar 1, 2020, 10:23 AM IST