డ్రోన్​పై దాడి చేసిన మొసలి- వీడియో వైరల్​! - మొసలి దాడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 1, 2021, 3:01 PM IST

ఆస్ట్రేలియాలో మొసళ్లను చిత్రీకరిస్తున్న డ్రోన్‌పై అనూహ్యంగా ఓ మొసలి దాడి(crocodile attack drone) చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో డ్రోన్‌ పూర్తిగా ధ్వంసం కాగా దాడి దృశ్యాలు మాత్రం రికార్డు అయ్యాయి. ఉత్తర ఆస్ట్రేలియాలో మొసళ్ల వేట విపరీతంగా పెరగడంతో దానిపై ఆస్ట్రేలియన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కార్పోరేషన్‌ డాక్యుమెంటరీ నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో డార్విన్ పట్టణంలోని సరస్సులోని మొసళ్ల దృశ్యాలను డ్రోన్‌ సాయంతో చిత్రీకరిస్తుండగా ఒక్కసారిగా మకరం ఓ డ్రోన్‌పైకి(crocodile attack drone) దూసుకొచ్చింది. నీటిలో నుంచి అమాంతం పైకి లేచి దాడి చేసింది. ఈ క్రమంలో డ్రోన్‌ నీటిలో కుప్పకూలగా.. కొన్ని వారాల తర్వాత సరస్సు ఒడ్డున డ్రోన్​ను గుర్తించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.