పరువు హత్యాయత్నం.. ప్రాణభయంతో దంపతులు రోడ్డుపైనే - పరువు హత్య తమిళనాడు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14629136-thumbnail-3x2-honour-killng.jpg)
Honour killing attempt in Tamil Nadu: తమిళనాడు కోయంబత్తూర్లో పరువు హత్యాయత్నం కలకలం రేపింది. కారులో వెళ్తున్న నవదంపతుల చుట్టూ పలువురు చేరి దాడికి యత్నించడం కెమెరాల కంటికి చిక్కింది. పలువురు వీరి వెంట పడగానే దంపతులు బిగ్గరగా అరిచారు. తమను కాపాడండంటూ చుట్టూ ఉండేవారిని వేడుకున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్.. వీరికి సాయం చేశారు. దంపతులను, వారి బంధువులను సరవనంపట్టి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. మణియకారంపలాయంకు చెందిన విగ్నేశ్, సరవనంపట్టికి చెందిన స్నేహ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. అయితే, తన కుటుంబ సభ్యులే తమపై దాడికి యత్నించారని స్నేహ ఆరోపించింది. తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని చెప్పింది. వారి వద్ద కత్తులు ఉన్నాయని విగ్నేశ్ చెప్పడం వీడియోలో కనిపిస్తోంది.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST