Kothapalli Waterfalls: భూలోక స్వర్గధామం.. కొత్తపల్లి జలపాతం - heavy floating at kothapalli waterfalls
🎬 Watch Now: Feature Video
Kothapalli waterfalls in Paderu: ఏపీలోని విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. భూలోక స్వర్గం.. జలక్రీడ ధామం.. కొత్తపల్లి జలపాతం సంతోష సాగరంలో మునిగితేలాడారు. రెండు రోజుల సెలవులతో ప్రకృతి రమణీయత మధ్య కొలువుదీరిన జలపాతాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసివచ్చి సెలయేటిలో స్నానం చేస్తూ ఆనందంగా గడిపారు. నిత్యం ఉరుకుల పరుగులు జీవితాల్లో తలమునకలైన తమకు... జలసవ్వళ్లు నూతన ఉత్సాహాన్ని నింపాయని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.