prathidwani: పర్యటకరంగంపై కరోనా పంజా.. మళ్లీ కోలుకునేదెలా.? - పర్యాటకంపై కరోనా దెబ్బ
🎬 Watch Now: Feature Video

రెండు దశల్లో ముసురుకున్న కరోనా పర్యాటక రంగాన్ని కట్టిపడేసింది. నిత్యం వేలాది మంది సందర్శకులతో కిటికిటలాడే దర్శనీయ స్థలాలిప్పుడు వెలవెలపోతున్నాయి. పర్యటకంపై ఆధారపడ్డ హోటళ్లు, రెస్టారెంట్లు, విహార కేంద్రాలు పునరుత్తేజం కోసం నిరీక్షిస్తున్నాయి. లక్షలాది మంది కార్మికులకు జీవనాధారమైన పర్యటకం, ఆతిథ్య రంగాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటి? ప్రభుత్వం వైపు నుంచి ఈ రంగం ఎలాంటి సహకారం ఆశిస్తోంది? సందర్శకులు, యాత్రికులతో ఈ కేంద్రాలు మళ్లీ ఎప్పుడు కళకళలాడుతాయి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.