'నవరాత్రుల్లో ఐదోరోజు ఆ పూలతో పూజిస్తే ఐశ్వర్యం మీ సొంతం' - Navratri Fifth day special what to do
🎬 Watch Now: Feature Video

దసరా శరన్నవరాత్రులు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దర్శనమిస్తుంది. ఐదో రోజు లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో జగన్మాత అభయ ప్రదానం చేస్తుంది. ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి... జగన్మాతకు పాయసం, పులిహోరలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే అమ్మవారి కృప మీ సొంతం అవుతుంది. మీ గృహంలోని అమ్మవారి చిత్రపటం వద్ద దీపారాధన చేసి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలి. అమ్మవారికి చామంతి పువ్వులతో పూజలు నిర్వహించాలి. ఇలా చేస్తే... సంవత్సరం మొత్తం ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రాప్తి కలుగుతుంది.