Healthy Habits Of senior citizens In Adilabad District : ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం మానవ జీవనంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆహార అలవాట్లలోనూ సమూల మార్పులు చోటుచోసుకుంటున్నారు. ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఆరోగ్యం దూరమైపోయింది. కానీ ఈ బామ్మలు వయస్సు వందేళ్లు దాటినప్పటికీ ఇంకా ఆరోగ్యంగా జీవించి ఉన్నారు. ఇందుకు కారణం తమ ఆహారపు అలవాట్లు, జీవన విధానమేనని వాళ్లంటున్నారు. ఆ నాటి నుంచి నేటి వరకు వారు కొనసాగిస్తున్న జీవన విధానంపై ప్రత్యేక కథనం.
పొద్దున్నే నిద్ర లేవడం- మితంగా ఆహారం తీసుకోవడం : ఆదిలాబాద్‌లోని తాంసి మండలం పొన్నారికి చెందిన ముచ్చ ఎల్లక్క ఇటీవలే 100 ఏళ్లు దాటి 101లోకి అడుగుపెట్టింది. భర్త మీనయ్య మధ్య వయసులోనే చనిపోవడంతో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు పెంపకం, పెళ్లిళ్లు, ఇంటి బాధ్యతలు అన్నీ ఎల్లక్క మీద పడ్డాయి. దినచర్యలో భాగంగా రోజూ తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి పనులు పూర్తి చేసుకునేది. అనంతరం వ్యవసాయ పనులకు వెళ్లి, కుటుంబాన్ని పోషించింది. వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ నేటికీ తన పనులు తానే చేసుకుంటుంది.
ఇంటి ఆవరణలోని పిచ్చి మొక్కలు తొలగించడం లాంటివి చేస్తుంటుంది. రాత్రి ఈటీవీలో వచ్చే ప్రొగ్సామ్స్ను తప్పక చూస్తుంది. కోడలు లక్ష్మిదేవి, మనవరాలు రేఖకు ఇంటి, వంట పనుల్లో సహాయం చేస్తూ ఆనందంగా జీవనం సాగిస్తుంది. మితంగా తినడం వ్యవసాయ పొలాల్లో కాలానుగుణంగా లభించే ఆకుకూరలు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం, పండ్లు, ఆలసట లేకుండా శ్రమించడమే తన ఆరోగ్య రహస్యమని ఎల్లక్క చెప్పింది.
కాలినడక..కంటి నిండా నిద్ర : ఆదిలాబాద్ దివ్యాంగుల కాలనీకి చెందిన కడెల్వార్ రుక్మాబాయికి ముగ్గురు కుమారులు. ఆశన్న, శంకర్, రాందాసు. వీరిలో శంకర్ చనిపోగా ఇద్దరు కుమారులు ఉన్నారు. జూన్‌లో 'రుక్మాబాయి 100వ పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులంతా కలిసి ఘనంగా నిర్వహించారు. వందేళ్లు దాటినప్పటికీ కంటిచూపు, వినికిడి లోపం లేదు. ప్రస్తుతం రోజూ ఉదయమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం, దుస్తులు ఉతుక్కుంటూ ఇంట్లో చిన్న చిన్న పనులను చేస్తుంటుంది. 80 ఏళ్లు వచ్చే వరకు కోటరిలో కూలీలతో కలిసి వ్యవసాయ పనులు చేసి, కుటుంబాన్ని ఆదుకుంది. చిన్నతనం నుంచి మాంసానికి దూరంగా ఉంటూ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, జొన్న రొట్టెలు, జొన్న గటుక, పాలు, పెరుగునే ఆహారంగా తీసుకుంటున్నానని రుక్మాబాయి పేర్కొంది. కాలినడతో పాటు కంటినిండా నిద్రపోతానని వివరించింది.
సునాయాసంగా రూ.10 కి.మీ నడక : నెన్నెల మండలంలోని ఘన్పూర్ గ్రామానికి చెందిన పుష్పాల సాంబయ్య 100 ఏళ్లకు సమీపంలో ఉన్నా ప్రస్తుతం పది కిలోమీటర్ల దూరం అవలీలగా నడుస్తుంటారు. మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం తరచూ కాలి నడకనే వెళ్తుంటారు. నేటికి మధుమేహం, బీపీ లాంటి వ్యాధులు అతడి దరి చేరలేదు. ఆయనకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. కానీ తన పనులను తాను ఇప్పటికీ చేసుకుంటుంటారు. తన జీవన విధానమే తనకు మేలు చేసిందని చెబుతారు. అప్పట్లో ఆవు పాలు, ఆకుకూరలు, నాటు కోళ్లు, జొన్నలు, రాగులు లాంటి చిరు ధాన్యాలు ఎక్కువగా తీసుకున్నానని తెలిపారు. పండించిన నువ్వుల నూనె వినియోగించే వారమన్నారు.
ఉదయాన్నే ఈ అలవాట్లను పాటిస్తే - మీరు 100 ఏళ్లు జీవించడం ఖాయం!
100 yrs old man doing Yoga : ఈ తాత మామూలోడు కాదు.. వందేళ్ల వయసులో యోగాసనాలు ఇరగదీశాడు