Kolatam event in Singareni school: అట్టహాసంగా జానపద కోలాటం.. ఆద్యంతం కనువిందు - janapada kolatam event in singareni school
🎬 Watch Now: Feature Video
Kolatam event in Singareni school: మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి పాఠశాలలో గురువారం సాయంత్రం సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలు, యువతులు, కళాకారులతో పాఠశాల మైదానం కళకళలాడింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. మహిళలు కోలాటం ఆడుతూ ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. జానపద కోలాటం పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి సందడి చేశారు. పదుల సంఖ్యలో గీసిన వృత్తాకారాల్లో లయబద్ధంగా కోలాటాలు ఆడుతూ.. జానపద గీతాల ప్రత్యేకతను చాటారు.