AAKERU: ఆకేరు వాగు పరవళ్లు.. పర్యాటకులకు కనువిందు - aakeru vaagu overflowing
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12536487-1051-12536487-1626944318003.jpg)
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తురు గ్రామ శివారులో ఉన్న ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. మత్తడి దూకుతూ పరవళ్లు తొక్కుతోంది. భారీ వరద ప్రవాహంతో ఆకేరు వాగులోకి నీరు పెద్ద ఎత్తున చేరడంతో చెక్ డ్యాముల పైనుంచి అలుగు పారుతూ కట్టి పడేస్తోంది. ఆకేరు అందాలను తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని సెల్ఫీలు తీసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలో చిత్రీకరించిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.