గొప్ప మనసు చాటుకున్న విజయ్ - 1500 మంది వరద బాధితులకు సహాయం - విజయ్ సహాయం
🎬 Watch Now: Feature Video
Published : Dec 30, 2023, 7:22 PM IST
|Updated : Dec 31, 2023, 6:51 AM IST
Vijay Flood Relief : తమిళ నటుడు విజయ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. తమిళనాడులో ఏర్పడిన వరదల కారణంగా పలు ప్రాంతాలు నీట మునగ్గా, ఆ ప్రదేశాల్లో పర్యటించిన ఆయన వారిని ఓదార్చారు. ఆ తర్వాత తూత్తుకుడి, నెల్లై ప్రాంతాల్లోని బాధితులకు ఆయన సహాయ సహకారాలు అందించారు. మాధ మళిగై కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాంలో బాధితులకు బియ్యం, కూరగాయలతో పాటు దుస్తులు, నిత్యావసరాలను అందించారు. అంతే కాకుండా కొంత మందికి నగదు సహాయాన్ని కూడా అందించారు. సుమారు 1500 మందికి భోజనాలను కూడా ఏర్పాటు చేశారు.
అయితే ఈ కార్యక్రమాని బాధితులను మాత్రమే అనుమతించార. టోకెన్ ఉన్నావారినే హాల్‌లోకి రానిచ్చారు. దీంతో హాల్ బయట విజయ్‌ని చూసేందుకు ఆయన అభిమానులు అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో అక్కడ కాస్త ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు విజయ్ గొప్ప మనసును కొనియాడుతున్నారు.