'మా రియల్ లైఫ్‌లో ఉప్పెన సీన్ రిపీట్.. వారి వల్ల చాలా ఇబ్బందులు!' - మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డి కపుల్
🎬 Watch Now: Feature Video
'ఉప్పెన' సినిమాలోని హీరో, హీరోయిన్ ప్రేమ జీవితంలో జరిగిన సంఘటనే తామిద్దరి లైఫ్‌లోనూ జరిగిందని తెలిపారు నూతన దంపతులు టాలీవుడ్ హీరో మంచు మనోజ్-భూమా మౌనిక రెడ్డి. ఇటీవలే ఈ జంట సన్నిహితుల సమక్షంలో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత ఈ జోడీ తొలిసారి ఆన్‌స్క్రీన్‌పై మెరిశారు. ఈటీలో ప్రసారమవుతున్న 'అలా మొదలయ్యింది' షోలో సందడి చేసిన ఈ జంట.. తామిద్దరి జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. అలానే నవ్వులు కూడా పూయించారు. అసలు తామిద్దరు ఎలా కలిశారు? ఎవరు రొమాంటిక్? పెళ్లి కాకముందు తామిద్దరి బంధం ఎలా ఉండేది? వంటి విషయాలను చెప్పుకొచ్చారు. ఇంకా మౌనిక రెడ్డికి కోపం వస్తే ఎలా ఉంటుందో సరదాగా యాక్షన్ చేసి చూపించారు మనోజ్. లైఫ్‌లో ఎన్నో కష్టాలు పడినట్లు గుర్తుచేసుకున్న ఆయన.. ఒకానొక దశలో ప్రేమ లేదా సినిమానా అని కన్ఫూజన్లో పడిపోయినట్లు చెప్పుకొచ్చారు. మరిన్ని విశేషాల కోసం ఈ వీడియో చూడండి.