Tamannaah Visit New Parliament Building : కొత్త పార్లమెంట్ భవనంలో మిల్క్ బ్యూటీ.. 'మహిళా బిల్లు'పై తమన్నా హర్షం - గణేశ్ చతుర్థి సంబరాల్లో నటి హన్సికా
🎬 Watch Now: Feature Video
Published : Sep 21, 2023, 4:51 PM IST
Tamannaah Visit New Parliament Building : ప్రముఖ సినీ తార తమన్నా భాటియా గురువారం భారత నూతన పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. భారత లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన వేళ.. దేశంలోని పలువురు మహిళా ప్రముఖులకు కేంద్రం ఆహ్వానం పంపింది. ఈ మేరకు తమన్నా పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. మంగళవారం పార్లమెంట్ సెషన్‌కు హాజరయ్యారు.
వినాయక పూజలో హన్సికా.. దేశమంతటా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రీసెంట్గా ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంట గణేశ్ చతుర్థి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ యాక్టర్లు హాజరయ్యారు. ఇక తాజాగా సినీ నటి హన్సికా.. ముంబయిలోని ఓ గణేశ్ మండపాన్ని సందర్శించారు. అక్కడ ఆమె ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.