బీఆర్ఎస్, బీజేపీ ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు : ప్రియాంక గాంధీ - రేవంత్‌రెడ్డి తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Nov 27, 2023, 7:28 PM IST
Priyanka Gandhi Speech in Kodangal Meeting Today : అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో.. ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్‌లో నిర్వహించిన విజయభేరీ సభలో పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Congress Election Campaign : బీఆర్ఎస్, బీజేపీ ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాయని ప్రియాంక గాంధీ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం.. తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో పేదలు, నిరుద్యోగుల సమస్యలు తీరలేదని.. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని దుయ్యబట్టారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి పదేళ్లు గడిచాయి.. నిరుద్యోగుల సమస్యలు తీరాయా? రైతుల కష్టాలు తీర్చరా? అని ప్రజలను ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకున్నారు తప్ప ప్రజలకు చేసిందేం లేదని విమర్శించారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసి గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. రైతుల రుణాలు మాఫీ చేయని మోదీ.. తన మిత్రులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేశారని మండిపడ్డారు. ధరణి పేరుతో ప్రజల భూములను బీఆర్ఎస్ సర్కారు గుంజుకుందని.. దొరల తెలంగాణలో ప్రజలకు ఒరిగిందేం లేదని దుయ్యబట్టారు. దొరల తెలంగాణకు చరమగీతం పాడి.. ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.