Dasara movie: సుదర్శన్ థియేటర్లో నాని సందడి.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ - దసరా సినిమా రివ్యూ
🎬 Watch Now: Feature Video
నేచురల్ స్టార్ నాని నటించిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'దసరా' చిత్రం నేడు(మార్చి 30) గ్రాండ్‌గా విడుదలైంది. దాదాపు మూడు వేల థియేటర్లలో పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో రిలీజ్ అయింది. భారీ ఓపెనింగ్స్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ వద్ద హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సందడి చేశారు. అభిమానులు, ప్రేక్షకులతో కలిసి మార్నింగ్ షో చూశారు. దీంతో నానిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో సుదర్శన్ థియేటర్ వద్ద హంగామా నెలకొంది. థియేటర్లో తన నటనకు, పాటలకు ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూసి నాని ఆనందం వ్యక్తం చేశాడు. కాగా, ఈ చిత్రంలో నాని ఎప్పుడూ కనిపించని.. మాస్ రగ్డ్ లుక్‌లో కనిపించారు. మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుందీ సినిమా. నాని కెరీర్‌లోనే ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని ఆడియెన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే శ్రీకాంత్ ఓదెల టేకింగ్‌ను ప్రశంసిస్తూ.. టాలీవుడ్‌కు మరో స్టార్ డైరెక్టర్ వచ్చేశాడని అంటున్నారు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం హైలైట్‌గా నిలిచిందని కొనియాడుతున్నారు.