'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' సినిమా.. 1990 నాటి కాలానికి అందర్నీ తీసుకెళ్తుందట! - అన్నపూర్ణ ఫొటో స్టూడియో మూవీ రిలీజ్ తేదీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 14, 2023, 8:30 PM IST

Annapurna Photo Studio Movie Cast : 30 వెడ్స్​ 21 ఫేమ్​ చైతన్యరావు, లావణ్య జంటగా తెరకెక్కిన సినిమా 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో'. ఈ చిత్రానికి చందు ముద్దు దర్శకత్వం వహించారు. బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా జూలై 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా 'ఈటీవీ భారత్​'తో తమ చిత్ర విశేషాలను పంచుకున్న దర్శకుడు చందు, కథానాయకుడు చైతన్య, కథానాయిక లావణ్య, హాస్యనటుడు భార్గవ. చక్కటి ప్రేమకథతోపాటు ఆసక్తికరమైన క్రైమ్ కామెడీతో అన్నపూర్ణ ఫొటో స్టూడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు చందు తెలిపారు. 

80, 90ల నాటి పరిస్థితులు ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో చైతన్యకృష్ణ.. అన్నపూర్ణ ఫొటో స్టూడియో సినిమా చంటి అనే పాత్ర చుట్టూ తిరుగుతుందని తెలిపారు. చంటి పాత్రను ప్రేక్షకులు బాగా ఇష్టపడతారని.. సినిమా ఆద్యంతం ఆ పాత్రతో ప్రయాణం చేస్తారని.. అది ఒక రోలర్​ కోస్టర్​ రైడ్​ లాగా ఉంటుందని చెప్పారు. తన పాత్ర పక్కింటి అమ్మాయిలా ఉంటుందని.. ఈ మూవీలో పాత్రలన్నింటికీ ప్రాధాన్యం ఉంటుందని హీరోయిన్ లావణ్య చెప్పారు. అన్నపూర్ణ ఫొటో స్టూడియో చిత్ర బృందంతో మా ఈటీవీ భారత్​ ప్రతినిధి సతీష్ ప్రత్యేక ఇంటర్వ్యూ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.