కంటైనర్‌ను ఢీకొట్టి డీజిల్ ట్యాంకర్ బోల్తా.. ముగ్గురు సజీవ దహనం? - డీజిల్ ట్యాంక్ బోల్తా
🎬 Watch Now: Feature Video
Road Accident: రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్ జిల్లాలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భదేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉదయ్‌పుర్ సమీపంలో ఓ డీజిల్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రెండు వాహనాలు మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు. వాహనాల్లో రెండు అస్థిపంజరాలు లభించినట్లు చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST