ప్రతిధ్వని: అంజనీసుతుడు ఆంజనేయుడు ఎక్కడ పుట్టాడు? - Anjanadri Hillock is Lord Hanuman’s birthplace
🎬 Watch Now: Feature Video
సకల దేవతాస్వరూపుడైన హనుమంతుడు ఎక్కడ పుట్టాడు? ఇంతకాలం... మా దగ్గరంటే మా దగ్గరే అంటున్నాయి... గుజరాత్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక రాష్ట్రాలు. అవేవీ కాదు.. కలియుగ వైకుంఠమైన వేంకటాచలమే ఆ స్వామి జన్మస్థలం అంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం. అభయం, ఆనందం రెండూ ఇచ్చే ఆంజనేయుడు... ఆనంద నిలయం పరిసరాల్లోనే జన్మించినట్లు విస్పష్టమైన ప్రకటన చేసింది అంజనాద్రిపై తిరుమల తిరుపతి దేవస్థానం నియమించిన నిపుణుల కమిటీ. పౌరాణిక, వాంగ్మయ, శాసన, భౌగోళిక ఆధారాలన్నీ పరిశోధించి... సాక్ష్యాధారాలు వడబోసి మరీ చెబుతున్నాం... ఆంజనేయుడు మనవాడే అంటోంది. శ్రీరామనవమి పర్వదినం సందర్భాన్నే అందుకు వేదికగా చేసుకున్నారు. ఆ అంశంపై నేటి ప్రతిధ్వని.