Bathukamma 2021: విదేశాల్లో బతుకమ్మ సంబురం - బతుకమ్మ సంబురాలు
🎬 Watch Now: Feature Video
దేశ విదేశాల్లోనూ... తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మను వైభవంగా జరుపుకుంటున్నారు. అమెరికాలోని న్యూయార్క్‌లో తెలంగాణ మహిళలంతా... ఒక దగ్గర చేరి బతుకమ్మ ఆడారు. డల్లాస్‌లోని బిగ్‌బ్యారెల్స్ రాంచ్ ఇన్ ఆబ్రేలో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్- టీపీఏడీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. డల్లాస్‌లోని ఫుట్‌బాల్ స్టేడియంలో ఏటా 10వేల మందితో బతుకమ్మ వేడుకలు నిర్వహించే టీప్యాడ్.. ఈసారి కొవిడ్ దృష్ట్యా గ్రామీణ వాతావరణంలో పచ్చని పంటచేల సమీపంలో నిర్వహించింది. తీరోక్కపూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో ఆడిపాడారు. ఎక్కడ ఉన్న మన సంప్రదాయాన్ని మర్చిపోకూడదన్న ఉద్దేశ్యంతోనే వేడుకలు నిర్వహించినట్లు మహిళలు తెలిపారు.