కార్లు, బైక్​లతో ఇంటర్​ విద్యార్థుల స్టంట్​ షో.. పోలీసుల షాక్​!

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 24, 2022, 4:52 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

Car Stunt Races: కేరళ కోజికోడ్‌లో ఇంటర్‌ విద్యార్థులు కార్లు, ద్విచక్ర వాహనాలతో ప్రమాదకర విన్యాసాలు చేశారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫైనల్‌ పరీక్షలు పూర్తయిన సందర్భంగా విద్యార్థులు సంబరాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున కార్లు, ద్విచక్ర వాహనాలతో కోజికోడ్‌లోని మలబార్‌ క్రిస్టియన్‌ కళాశాల మైదానంలో గుండ్రంగా చక్కర్లు కొడుతూ కేరింతలు కొట్టారు. ఈ క్రమంలో ఓ ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టగా ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. ఘటనపై మోటర్‌ వాహనాల చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కనీసం డ్రైవింగ్​ లైసెన్స్​ పొందే వయసు కూడా లేదని చెప్పారు. బాలురతో పాటు బాలికలు సైతం ఇందులో పాల్గొన్నట్లు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.