పండుగ సీజన్లో కొత్త 'ట్రెండ్స్'పై ఓ లుక్కేయండి! - వస్త్రాభరణాల ప్రదర్శన
🎬 Watch Now: Feature Video
దసరా, దీపావళి, పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో ట్రెండ్స్ పేరిట వస్త్రాభరణాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీనిని మోడల్, వర్ధమాన నటి సింధూరెడ్డి, ప్రముఖ డిజైనర్ చందనా, వ్యాపారవేత్త మమతారెడ్డి, నిర్వాహకురాలు శాంతి ప్రారంభించారు. పండుగ సీజన్లో మహిళలకు కావాల్సిన అన్నిరకాల వస్త్రాలు, ఆభరణాలు ఒకే వేదికపై ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని సింధూరెడ్డి తెలిపారు. ఈ ప్రదర్శన మూడు రోజులపాటు కొనసాగనుంది. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 80 మంది డిజైనర్లు రూపొందించిన ఉత్పత్తులను నగర ఫ్యాషన్ ప్రియులకు అందిస్తున్నట్లు నిర్వాహకురాలు తెలిపారు.