వరదలతో బ్రెజిల్ అతలాకుతలం... 94 మంది మృతి - brazil heavy rains
🎬 Watch Now: Feature Video
Brazil mudslides: బ్రెజిల్ రాష్ట్రంలోని రియో డి జెనీరోలో వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 94 మంది మరణించారని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మరిన్ని మృతదేహాలు కొండచరియల కింద కూరుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. భారీగా కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవ పరిస్థితిని ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి ఉందని స్థానిక మేయర్ రూబెన్స్ బొంటెంపో పేర్కొన్నారు. ఎంతమంది ఆచూకీ కోల్పోయారనే విషయం కూడా తెలియలేదని చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:16 PM IST