'పౌర' ఆగ్రహం: బంగాల్ గవర్నర్​కు​ నిరసన సెగ - West Bengal Governor Jagdeep Dhankhar shown black flags on caa

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 23, 2019, 3:20 PM IST

బంగాల్ గవర్నర్​ జగదీప్​ ధన్​కర్​కు మరో చేదు అనుభవం ఎదురైంది. కోల్​కతాలోని జాదవ్​పుర్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి వెళ్లిన ఆయనను పౌరచట్టం అంశమై విద్యార్థులు ఘెరావ్​ చేశారు. కారు.. వర్సిటీ ప్రాంగణంలోకి చేరగానే చుట్టుముట్టారు. అనంతరం పౌరచట్టానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ, నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్​ ధన్​కర్​కు కారు దిగడం కూడా కష్టమైపోయింది. కొద్ది సమయం అనంతరం కారు నుంచి బయటికొచ్చారు గవర్నర్. ఇటీవల అసెంబ్లీ సందర్శనకు వెళ్లిన సమయంలోనూ ఇదే అనుభవం ఎదురైంది. అసెంబ్లీ గేట్లు మూసి ఆయనను అడ్డుకోగా రెండో ప్రవేశద్వారం నుంచి వెళ్లాల్సి వచ్చింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.