వైరల్: మెట్రో ఎక్కిన వానరం.. ఆహ్లాదకరంగా ప్రయాణం! - కోతి వైరల్ వీడియోలు
🎬 Watch Now: Feature Video
దిల్లీ మెట్రో రైల్లో ఊహించని అతిథి ప్రయాణం చేసి అందరినీ ఆశ్చర్యపరచింది. అనుకోకుండా ప్రయాణికుల కోచ్‌లోకి ఓ కోతి ఎక్కింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మొదట కోచ్‌లో అటూ ఇటూ తిరిగిన వానరం.. చివరికి ప్రయాణికులతో పాటు సీటుపై, కిటికీ వద్ద కూర్చుని బయటి పరిసరాలను ఆస్వాదిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. ట్విట్టర్‌లో షేర్ అయిన ఈ వీడియో యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ వీడియోను ధ్రువీకరించలేదు.