బీజాపుర్ అడవుల్లో నక్సలైట్ల అంతిమయాత్ర! - బీజాపుర్ ఎన్కౌంటర్
🎬 Watch Now: Feature Video
బీజాపుర్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో 24మంది పోలీసులు అమరులయ్యారు. వీరితో పాటు నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ క్రమంలో.. మావోయిస్టులకు చెందిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీడియోలో.. మరణించిన మావోయిస్టుల అంతిమ యాత్రలో వందల మంది పాల్గొన్నారు. అడవుల్లో వారి మృతదేహాలను మోస్తూ.. 'అమర్ రహే' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అయితే ఈ వీడియోకు.. బీజాపుర్ ఘటనకు సంబంధం ఉందా? అన్న విషయంపై స్పష్టత లేదు.