రజనీ ఇంటి వద్ద అభిమానుల కోలాహలం
🎬 Watch Now: Feature Video
సూపర్ స్టార్ రజనీకాంత్ 70వ పుట్టినరోజు సందర్భంగా.. పోయస్ గార్డెన్లోని ఆయన నివాసం వద్ద అభిమానులు పెద్దఎత్తున గుమిగూడారు. వారిలో కొందరు తలైవా వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రోబో.. భాషా తదితర చిత్రాల్లోని రజనీ గెటప్లను వేసి అలరించారు. రజనీకాంత్ పోస్టర్లు పట్టుకుని తమదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నారు. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఈ పుట్టినరోజును అభిమానులు మరింత ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు.