జామియా వీడియో: విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ - lathi-licking on students
🎬 Watch Now: Feature Video
దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ విద్యార్థులపై... యూనివర్సిటీ లోపలే పోలీసులు లాఠీచార్జ్ చేసిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు పోలీసులు కర్రలతో కొడుతున్న సీసీటీవీ దృశ్యాలను జామియా సమన్వయ సమితి విడుదల చేసింది. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గతేడాది డిసెంబర్ 15న వర్సిటీలో పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. సీఏఏకు వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సివచ్చింది. అదే రోజు యూనివర్సిటీలోని రీడింగ్ హాల్ లో ఉన్న విద్యార్థులను పోలీసులు కర్రలతో కొట్టారని సీఏఏకు వ్యతిరేకంగా పోరాడుతున్న జామియా సమన్వయసమితి ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి దృశ్యాలను శనివారం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.
Last Updated : Mar 1, 2020, 12:23 PM IST