నట్టింట పూజలందుకో నాగరాజా! - utthara_kannada
🎬 Watch Now: Feature Video
పుట్టకో, ఫోటోకో కాదు తాను నమ్మే దైవాన్ని ఇంటికే తెచ్చుకున్నాడో పాము ప్రేమికుడు. ఉత్తర కన్నడ జిల్లాలో శిరసిలో నాగులపంచమి రోజు రెండు నిజమైన నాగు పాములకు పూజలు చేసి అసలైన భక్తుడు అనిపించుకున్నాడు ప్రశాంత్ హులేకల్. పామును ఇంట్లోకి ఆహ్వానించి కోరలు కూడా తీయకుండా ఇంటిల్లిపాది నిర్వహించే ఈ పూజా కార్యక్రమంలో భక్తి తప్ప భయం కనిపించదు. ముప్పై ఐదేళ్లుగా నాగులను సంరక్షించాలనే సందేశాన్ని చాటుతోందీ కుటుంబం. నాగుల పంచమి వచ్చిందంటే చాలు.. ఇలా నాగులు వారింట సందడి చేస్తాయి!