తల్లితో పులి పిల్లల విహారం.. వీడియో వైరల్ - కార్బెట్ పార్క్
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్ రామ్‌నగర్‌లోని జిమ్ కార్బెట్ అభయారణ్యంలో తల్లి పులితో పాటు పిల్లపులులు సందడి చేశాయి. మొత్తం నాలుగు పిల్లలు ఉండగా.. పెద్ద పులితో పాటు అటుఇటూ తిరుగుతూ ఆనందంగా గడిపాయి. అక్కడకు వచ్చిన పర్యటకులు ఈ దృశ్యాలను ఫోన్ కెమెరాలో రికార్డు చేశారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ పార్కుకు పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పులి సంచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.