1200 కిలోల పువ్వులతో మురిసిన ముగ్గు!
🎬 Watch Now: Feature Video
కేరళలో 11 రోజుల ఓనం సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఆ రాష్ట్ర సాంస్కృతిక రాజధాని అయిన త్రిస్సూర్‌లో పూలకోలంతో ఓనం ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. టెక్కినాడు వడక్కునాథం ఆలయ ఆవరణలో సయాన సౌహ్రిద బృందం వారు ఇలా నేలపై అందంగా పూల ముగ్గు వేశారు. 52 అడుగుల విస్తీర్ణంలో ఉన్న పూలకోలం కోసం 1200 కిలోల పుష్పాలు ఉపయోగించారు. ఈ భారీ ముగ్గును ప్రముఖ చిత్రకారుడు నందన్ పిళ్లై డిజైన్ చేశారు. పూలకోలాన్ని తిలకించేందుకు వచ్చే జనంతో గుడి ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది.
Last Updated : Sep 29, 2019, 6:33 AM IST