వైరల్: రైలు మీద నుంచి వెళ్లినా ప్రాణాలు సేఫ్ - ఉత్తర్ప్రేదేశ్లో రైలు ట్రాక్ పై పడుకున్న వ్యక్తి
🎬 Watch Now: Feature Video
ఉత్తర్ప్రదేశ్ మథురాలో ఓ వింత ఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన ఓ వ్యక్తి దగ్గరలోని రైలు పట్టాల మీద పడుకున్నాడు. రైలు మీద నుంచి వెళ్లినా ఆయనకు చిన్న గాయం కూడా కాలేదు రాయ పోలీస్ స్టేషన్ పరిధిలోని బదుద్ధీన్ గ్రామానికి చెందిన గజేంద్ర.. కుమారుని మృతితో మానసిక వేదనకు గురై చనిపోవాలనుకుని ఇలా చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.