వైరల్: షికారుకు వెళ్తున్న మంచు చిరుత!
🎬 Watch Now: Feature Video
హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్-స్పితి ప్రాంతంలో అరుదైన మంచు చిరుత పులి కనిపించింది. శ్వేత వర్ణ మంచుదిబ్బలపై షికారుకు వెళ్తున్న ఈ పులి వీడియో.. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. హిమపాత సమయంలో వేట కోసం ఈ మంచు చిరుతలు.. లోతట్టు ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో పులి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు. లాహౌల్, స్పితి, కిన్నౌర్, పాంగి, చాంబా ప్రాంతాల్లో 49 మంచు చిరుతలు ఉన్నట్లు ఇటీవల జరిపిన ఓ సర్వేలో తేలింది.