చేతిపంపు కొట్టి.. దాహం తీర్చుకున్న ఏనుగు - మహారాష్ట్ర ఏనుగు వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12048392-thumbnail-3x2-eleph.jpg)
దాహంగా ఉన్న ఓ ఏనుగు చేతిపంపు కొట్టి మరీ తన దప్పికను తీర్చుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కమలాపూర్ ఏనుగుల శిబిరంలో ఈ దృశ్యం కనిపించింది. ఏనుగులు నీరు తాగేందుకు పెద్ద సరస్సు ఉందని అటవీ శాఖ అధికారి తెలిపారు. అయితే హ్యాండ్ పంప్ కొట్టడం నేర్చుకున్న 'రూపా' అనే ఈ ఏనుగు కొన్నిసార్లు ఇలా చేసి, నీళ్లు తాగుతుందని వివరించారు.