చెడ్డీ గ్యాంగ్‌ను మించిన దొంగ- ఒంటిపై బట్టల్లేకుండా చోరీలు - సింగనళ్లూర్ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video

తమిళనాడులో ఓ దొంగ చెడ్డీ గ్యాంగ్‌ను మించిపోయాడు. అర్ధరాత్రి సమయంలో ఒంటిపై బట్టల్లేకుండా వరుస చోరీలకు పాల్పడుతున్నాడు. టూ వీలర్, ఫోర్ వీలర్ వాహన షోరూంలే లక్ష్యంగా కోయంబత్తూర్, చెన్నై, మధురైలోని 17ప్రదేశాల్లో దొంగతనాలు చేశాడు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన సింగనళ్లూరు పోలీసులు ఎట్టకేలకు అతడిని పట్టుకున్నారు. షోరూం బయటి వరకు దుస్తులు ధరించి వెళ్లే ఈ దొంగ.. లోపలికి మాత్రం నగ్నంగా ప్రవేశిస్తాడు. అయితే తన దుస్తులు చూసి పోలీసులు గుర్తుపట్టొద్దనే కారణంతోనే నగ్నంగా వెళ్తున్నట్లు అతడు విచారణలో తెలిపాడు.