కత్తులతో డాన్స్ చేసి.. చివరికి కస్టడీకి చేరి! - వేడుకల్లో కత్తులతో ఎగిరిన యువకులు
🎬 Watch Now: Feature Video
స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా కర్ణాటక కలబురిగి ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు సరదాగా కత్తులు చేతులో పట్టుకొని డాన్స్ చేశారు. దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. అయితే ఈ చర్యపై ఆగ్రహించిన పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 107 కింద నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులను ఇమ్రాన్, తబ్రాజ్, రషీద్, అఫ్రోజ్, తల్హా, సోహిల్, జహీర్గా గుర్తించారు.