ETV Bharat / state

రేషన్​ బియ్యం బస్తాల్లో వరి పొట్టు - ఇలాంటి సీన్ ఎక్కడా చూసుండరు! - RATION MAFIA IN TELANGANA

రేషన్​ డీలర్​ అతి తెలివి - రేషన్​ బియ్యం మాయం చేసి బస్తాల్లో వరి పొట్టు నింపిన డీలర్​ - ముందస్తు సమాచారంతో లోగుట్టు బయటపెట్టిన రెవెన్యూ అధికారులు

Ration Rice Irregularities
Ration Rice Irregularities (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2024, 2:09 PM IST

Ration Rice Irregularities : పేద ప్రజలకు చేరాల్సిన రేషన్​ బియ్యం పక్కదారి పడుతున్న ఘటనలు చాలానే చూస్తున్నాం. ఏపీలోని కాకినాడ పోర్టులో ప్రభుత్వ బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్న షిప్​లను పట్టుకున్న దగ్గర నుంచి తెలుగు రాష్ట్రాల్లో రేషన్​ బియ్యం అక్రమాలు రోజురోజూకూ వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడి బియ్యాన్ని దేశ విదేశాలకు రేషన్​ మాఫియా పక్కదారిలో, అధికారుల కళ్లు కప్పి దాటిస్తున్నారు. ఇప్పటివరకు ఇలా వందల కోట్లు విలువ చేసే బియ్యాన్ని పక్కదారి పట్టించారు. ముఖ్యంగా రేషన్​ మాఫియాకు నెలవుగా కొందరు రేషన్​ డీలర్లు ఉంటున్నారు. వీరు ఎంచక్కా బియ్యాన్ని నల్ల బజార్లలో అమ్మేస్తూ పేదల పొట్టలు కొడుతున్నారు. విభిన్న రూపాల్లో బియ్యాన్ని అడ్డదారిలో బయటకు పంపి, కోటీశ్వరులు అవుతున్నారు. ఇందులో బడా రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ఉన్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి.

తాజాగా ఇక్కడి చిత్రంలో ఇద్దరు యువకులు ఒంటిచేత్తో రేషన్​ దుకాణంలో బస్తాలను పైకెత్తేస్తున్న దృశ్యాలు చూస్తున్నారు కదా. అవి ఏ బస్తాలో తెలుసా? నిజానికి వారేమీ మల్లయోధులు కాదండోయ్! ప్రజా పంపిణీలో సరఫరా చేసే బియ్యాన్ని అక్రమ మార్గంలో తరలించి, వాటి స్థానంలో నింపేసి పెట్టిన వరి పొట్టు బస్తాలను ఇలా ఒంటి చేత్తో ఎత్తేస్తున్నారు.

Ration Rice Irregularities
రేషన్​ బియ్యం బస్తాలను పరిశీలిస్తున్న ఆర్​ఐ (ETV Bharat)

ఏ క్షణంలో ఏ అధికారి వచ్చి తనిఖీలు చేస్తారో అన్న ఆలోచనతో రేషన్​ డీలర్ కొత్త పంథాకు తెర తీశాడు. నిల్వల్లో తేడా రాకుండా ఉండేందుకు వరిపొట్టు నింపిన బస్తాలను బియ్యం స్థానంలో ఉంచాడు. అనుమానం రాకుండా ఉండేందుకు ముందు వరుసలో బియ్యంతో ఉన్న బస్తాలను ఉంచి, వాటి వెనక వరుసలో వరి పొట్టు బస్తాలను అమర్చాడు. ఈ విషయం అధికారులకు ముందే తెలిసి లోగుట్టును రట్టు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

58 క్వింటాళ్లకు కేవలం 25 క్వింటాళ్లు మాత్రమే : ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం మిట్టపల్లిలోని రేషన్​ దుకాణం-5లో బియ్యం నిల్వల్లో తేడా రావడంతో శుక్రవారం రెవెన్యూ అధికారులు రేషన్​ దుకాణంలో తనిఖీలు చేసి, సీజ్​ చేశారు. వీరికి విస్తుపోయే నిజాలు తెలిశాయి. తహసీల్దార్​ ఎ.వనజ ఆదేశాల మేరకు ఆర్​ఐ ఖాజామోహీనుద్దీన్​ దుకాణాన్ని తనిఖీ చేశారు. అక్కడ 58 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉండాల్సి ఉండగా, కేవలం 25 క్వింటాళ్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 33 క్వింటాళ్ల బియ్యం స్థానంలో బస్తాల్లో వరిపొట్టును నింపి ఉంచటం తనిఖీల్లో గుర్తించారు. వెంటనే రేషన్​ డీలర్​ వేద మహేశ్వరిపై 6ఏ కేసు నమోదు చేసి, దుకాణాన్ని రెవెన్యూ అధికారులు సీజ్​ చేశారు.

స్మగ్లింగ్​కు హబ్​గా కాకినాడ పోర్టు - రేషన్​ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టం : పవన్​ కల్యాణ్

'చౌక'గా కొనుగోలు చేసి - రూ.కోట్లు కొల్లగొడుతున్నారు - సముద్రాలు దాటుతున్న రేషన్​ బియ్యం - PDS Rice Mafia in Khammam

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.