ఎంపీ వినోద్‌కు తుపాకీ ఎక్కుపెట్టిన పార్లమెంటు సిబ్బంది! - పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
🎬 Watch Now: Feature Video
పార్లమెంటు వద్ద భాజపా ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ కారు కాసేపు కలకలం రేపింది. పార్లమెంటు భద్రతా గేటు-1 వద్ద ఉన్న బూమ్ బారియర్‌కు ఎంపీ కారు ప్రమాదవశాత్తు తాకింది. వెంటనే అక్కడే అమర్చిన మేకుల్లాంటి పరికరాలు బయటకు రావటం వల్ల ఎంపీ కారు దెబ్బతింది. భద్రత ఉల్లంఘన జరిగిందేమోననే భావనతో వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై తుపాకులు ఎక్కుపెట్టారు. అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.