పొగాకు నియంత్రణపై 'సైకత' సందేశం - పొగాకు వ్యతిరేక దినంపై సుదర్శన్ పట్నాయక్ ఆర్ట్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11961054-thumbnail-3x2-parole-555.jpg)
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ వినూత్నంగా సందేశం ఇచ్చారు. పొగాకు వినియోగంపై ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పం తయారు చేశారు. పొగాకు వినియోగం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను వివరించేలా ఈ శిల్పాన్ని తీర్చిదిద్దారు. కరోనా కాలంలో పొగాకు తాగడం ఇతరులకు కూడా ప్రమాదకరమని తెలిపేలా కళాఖండాన్ని రూపోందించారు. సైకత శిల్పంతో పొగాకు వినియోగంపై ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు ఇలా చేశానని తెలిపారు సుదర్శన్ పట్నాయక్. ఈ కళాఖండం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.