రెండు ఏటీఎంలు పగలగొట్టి రూ.40 లక్షలు చోరీ - State Bank of India
🎬 Watch Now: Feature Video
ATM robbery case: అసోంలోని బొంగైగావ్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. నగరంలోని భారతీయ స్టేట్ బ్యాంకుకు చెందిన రెండు ఏటీఎంలను పగలగొట్టి రూ.40 లక్షల నగదును దోచుకెళ్లారు. సుమారు 4-6 మంది దుండగులు ఏటీఎంలోకి చొరబడి ముందుగా సీసీటీవీ కెమెరాల తీగలు కత్తెరించారని బొంగైగావ్ స్టేషన్ ఓసీ ఉపెన్ కలితా తెలిపారు. గ్యాస్ కట్టర్స్ ఉపయోగించి ఏటీఎంలను పగలగొట్టినట్లు చెప్పారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. ఓ వాహనం అనుమానాస్పదంగా తిరగటాన్ని గుర్తించామన్నారు.