రాజస్థాన్ కాంగ్రెస్ నేతల హంగామా.. హోటల్లో 'అంత్యాక్షరి' - రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అనుయాయులు
🎬 Watch Now: Feature Video
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మద్దతుదారులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు అంత్యాక్షరి ఆడుతున్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువనేత సచిన్ పైలట్ వర్గం గళమెత్తింది. దీనితో రాజస్థాన్ రాజకీయాలు వేడెక్కాయి. రిసార్టు రాజకీయాలు కూడా నడిచాయి. అయితే ఓ వైపు బడా నేతలు రాజకీయ ఎత్తుగడల్లో మునిగితేలుతుంటే.. మరోవైపు జైపుర్లోని హోటల్ ఫార్మౌంట్లో ఉన్న చోట.. నేతలు అంత్యాక్షరి ఆడుతూ ఉల్లాసంగా గడపడం విశేషం.