'పౌర' సెగ: గుజరాత్లో నిరసనకారులపై లాఠీఛార్జి - పౌరసత్వ చట్టం, జాతీయ పౌర జాబితా
🎬 Watch Now: Feature Video
పౌరసత్వ చట్టం, జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ)కి వ్యతిరేకంగా గుజరాత్ అహ్మదాబాద్‌లోని సర్దార్ బాగ్ ప్రాంతంలో చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులపై లాఠీఛార్జి చేశారు పోలీసులు. శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు.. ఎలాంటి అనుమతులు లేకుండా నిరసనలు చేపట్టిన వారిని చెదరగొట్టినట్లు అధికారులు తెలిపారు. వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం, వాటి అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో కొంతమంది ఈ ఆందోళనలు చేపట్టారు.