రోడ్డు సదుపాయం కరవు.. భుజాన డోలీ బరువు - కర్ణాటకలో రోడ్డు సదుపాయం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10877083-thumbnail-3x2-ww.jpg)
సాంకేతిక పథంలో దేశం దూసుకుపోతున్నా దేశంలోని చాలా ప్రాంతాల్లో సరైన రోడ్డు సౌకర్యాలు లేవు. కర్ణాటక, ఉత్తర కన్నడ జిల్లా వరినబెళ గ్రామానికి ఇప్పటికీ రోడ్డు మార్గం లేదు. పక్షవాతంతో బాధపడుతున్న 70 ఏళ్ల నూర పొక్క గౌడా అనే వ్యక్తిని డోలీ సాయంతో 5 కిలోమీటర్లు మోసుకెళ్లి వైద్యం చేయించారు కుటుంబసభ్యులు. ఈ గ్రామం కొండప్రాంతంలో ఉంది. అందువల్ల అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. తమ గ్రామానికి సరైన రోడ్డు మార్గం కల్పించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.