Live video: పాత కక్షలతో సోదరుడిని కత్తితో నరికి హత్య - brother murdered his on brother
🎬 Watch Now: Feature Video
Man killed by brother: హరియాణా, ఫరీదాబాద్ జిల్లాలో మంగళవారం దారుణ ఘటన జరిగింది. కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షలతో పాఖల్ గ్రామానికి చెందిన రాకేశ్(32) అనే వ్యక్తిని.. సోదరుడే ఆయుధంతో నరికి చంపాడు. ఈ దృశ్యాలు స్థానికంగా ఉండే ఓ భవనంలోని సీసీటీవీలో నమోదయ్యాయి. తన చిన్ననాన్న కొడుకు లలిత్ బైసోయా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం గొడవ జరగ్గా.. నిందితుడు పదునైన కత్తితో పలుమార్లు దాడి చేశాడని, తీవ్రంగా గాయపడిన బాధితుడుని ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మరణించినట్లు చెప్పారు. నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
Last Updated : Dec 29, 2021, 2:01 PM IST