దేవునికి పూజ చేసి.. హుండీ ఎత్తుకుని పరార్ - మహారాష్ట్ర ఠాణె వార్తలు
🎬 Watch Now: Feature Video
ఆలయంలోకి ప్రవేశించిన ఓ దొంగ.. కాసేపు దేవుని విగ్రహం ముందు ప్రార్థన చేసి, తర్వాత తన పనితనం ప్రదర్శించాడు. ఆలయంలో ఉన్న హుండీని ఎత్తుకుని పరారయ్యాడు. మహారాష్ట్ర ఠాణెలోని ఖోపత్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. నవంబరు 9న రాత్రి 9 గంటలకు ఆలయంలో ప్రవేశించిన ఓ దొంగ.. రూ.1,000 నగదు ఉన్న హుండీని ఎత్తుకెళ్లాడని ఓ అధికారి తెలిపారు. ఈ చోరీ దృశ్యాలు ఆలయంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో శనివారం నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన వీడియో.. వైరల్గా మారింది.