లైవ్ వీడియో: శివాలయంలో నాట్యమాడిన జంట నాగులు - Naga panchami latest news
🎬 Watch Now: Feature Video
నాగుల పంచమి రోజు నాగుపామును చూడటం శుభ సూచకంగా భావిస్తారు చాలామంది. అలాంటిది ఒకేచోట నాగసర్పాల జంటనే చూస్తే.! ఇంకేముంది.. అక్కడే ఆగిపోతారు. అలాంటి దృశ్యమే మధ్యప్రదేశ్లోని జబల్పుర్లో చోటుచేసుకుంది. శోభాపుర్ కొండల్లో ఉన్న శివాలయ ప్రాంగణంలో జంట సర్పాలు నాట్యమాడుతూ దర్శనమిచ్చాయి. రెండు పాములూ ఆలింగనం చేసుకొని అలా నాట్యం చేయగా.. స్థానికులు తమ చరవాణుల్లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి.