'లాల్ బాగ్చా రాజా' అదిరిపోయే ఫస్ట్‌లుక్ - ganesh
🎬 Watch Now: Feature Video
లాల్ బాగ్చా రాజా గణేశుడి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు ముంబయిలోని చారిత్రక సార్వజనిక్ గణేశోత్సవ్ మండలి నిర్వాహకులు. భారత అంతరిక్ష కార్యక్రమం ఇతివృత్తంగా ఈ విఘ్నేశుడిని నెలకొల్పారు. మండపం పైకప్పు నుంచి కిందకు వేలాడదీసిన 'పీకే' చిత్రంలోని గ్రహాంతర వాసుల వాహనం... వినాయకుడి చుట్టూ చంద్రయాన్-2 వ్యోమనౌక నమూనా, అంతరిక్ష యాత్రికులు... రోదసిలో ఉన్నట్లుగా భ్రమింపజేసేలా వెనకాల డిజిటల్ స్క్రీన్‌లో గ్రహాల పరిభ్రమణంతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ ఫస్ట్‌లుక్.
Last Updated : Sep 28, 2019, 10:46 PM IST