బంగాల్ గవర్నర్‌కు రెండో రోజూ తప్పని 'పౌర' సెగ - జాధవ్పుర్ విశ్వవిద్యాలయంలో ధన్కర్ వార్తలు
🎬 Watch Now: Feature Video
బంగాల్ గవర్నర్ జగదీశ్ ధన్కర్కు వరుసగా రెండోరోజూ చేదు అనుభవం ఎదురైంది. జాదవ్‌పుర్ విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన స్నాతకోత్సవానికి హాజరయ్యే సమయంలో నిలువరించిన విద్యార్థులు ఈ రోజు కూడా ధన్కర్ కాన్వాయ్‌ను అడ్డగించారు. ధన్కర్ కారు ముందు నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఇటీవలి కాలంలో జగదీశ్ ధన్కర్కు ఇలాంటి సంఘటనలు తరచూ ఎదురవుతున్నాయి. అయితే.. ఈ ఘటనపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగాల్‌లో వ్యవస్ధలు కుప్పకూలిపోయాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Last Updated : Dec 24, 2019, 12:41 PM IST