బురదలో ఆడిపాడిన చిన్నారులు, మహిళలు.. ఎందుకంటే? - బురదలో చిన్నారుల ఆటలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13830725-thumbnail-3x2-kesard.jpg)
Kesard Onji Dina event: కర్ణాటక మంగళూరులోని స్థానిక ప్రజలు ఆదివారం 'కేసార్డ్ ఒంజి దిన' వేడుకను ఘనంగా జరుపుకున్నారు. బురదలో చిన్నారులు, మహిళలు దిగి, ఆడిపాడి సరదాగా గడిపారు. మంగళూరు శివారులోని యెక్కూర్ వద్ద విజయ యువ సంగమ ఈ కార్యక్రమం నిర్వహించింది. వ్యవసాయం, క్రీడల పట్ల అవగాహన కోసమే తాము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా.. పరుగుపందెం, కబడ్డీ, వెనకకు పరుగెత్తడం, వాలీ బాల్, త్రోబాల్ వంటి పోటీలను నిర్వహించగా పిల్లలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.